After indian government’s Stop usage of chinese video sharing app tiktok, indian apps tried to fill the dragan country’s app. but still they are in a way to make it possible.
#TikTokinindia
#Indianapps
#RelianceIndustriesinvestmentinTikTok
#TikTokRepalcementindianapps
#Chingari
#Sumitghosh
#TikTokinUS
#DonaldTrump
#MicrosofttoBuyTikTok
#TikTokMicrosoftdeal
#MukeshAmbani
#ChineseApps
#ChinaByteDance
#chinaapps
#TikTokvideos
#59MobileApps
#PUBG
#టిక్ టాక్
గల్వాన్ లోయలో భారతీయ సైనికులపై దాడి తర్వాత చైనాకు చెందిన యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం వరుసగా నిషేధం విధిస్తోంది. అదే సమయంలో వీటి స్ధానంలో దేశీయ యాప్‌ల తయారీని ప్రోత్సహిస్తోంది. కానీ చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్ధకు చెందిన వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ స్ధానంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వందలాది యాప్‌లు ఆ లోటు భర్తీ చేయడంలో సఫలమవుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తున్నా మెజారిటీ జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు కనిపిస్తోందని చెబుతున్నారు. టిక్ టాక్ స్ధాయిని అందుకునేందుకు ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ సంస్ధ సృష్టించిన టిక్ టాక్ యాప్ భారత్‌తో పాటు పలు దేశాల్లో సంచలనాలు రేపింది. అదే సమయంలో కేంద్రం ప్రోత్సాహంతో టిక్‌టాక్‌ను పోలిన వందల కొద్దీ యాప్‌లు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. వీటి విషయంలో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా మేకిన్ ఇండియా ప్లాన్‌లో భాగంగా స్వదేశీ ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయని చెప్పవచ్చు. గతంలో దీనిపై అంతగా దృష్టిపెట్టని స్టార్టప్ సంస్ధలు కూడా ఇప్పుడు వీడియో షేరింగ్ యాప్‌లకు ఉన్న ఆదరణను గుర్తిస్తున్నాయి.